Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
విడాకుల పిటిషన్ను కోర్టులో ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్యను ఒప్పించేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. ఇక, అతని ప్రతిపాదనను భార్య తిరస్కరించడంతో పాటు అతడి వల్ల చాలా బాధలు భరించినట్లు ముఖం మీద చెప్పడంతో.. ఆమె ఉంటున్న ఇంటి కారిడార్ ముందు పెట్రోల్ డబ్బాతో వచ్చి నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.
Aero India Show: ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూర్ శివారులోని యలహంకలో జరుగనున్నాయి. ఎరో ఇండియా షో దృష్ట్యా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు యలహంక వైమానిక దళ స్టేషన్ నుంచి 13 కి.మీ పరిధిలో అన్ని మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లను మూసేయాలని బెంగళూర్ నగరపాలక సంస్థ శనివారం ఆదేశించింది.
ప్రయాణికులకు బెంగళూరు మెట్రో షాకిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచింది.
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫొటోలతో మామ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. దీంతో మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట డిజిటల్ అరెస్ట్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి.. అమాయకుల బలహీనతను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగి లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తున్నారు. అనంతరం బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
China Virus: అందరు భయపడుతున్నట్లే జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) సోకింది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధ్రువీకరించింది.