వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు, కానీ ఈ మార్జిన్ అప్రతిపాదితంగా ఉన్నది అని, దుకాణ యజమానులు పెంచాలని కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం మునుగోడులో బెల్ట్ షాపులు ఉండవని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఎవరి మాట విననని అన్నారు. పదవి పోయినా బెల్ట్ షాపులను తెరవనివ్వనని కరాఖండిగా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయమని అన్నారు.