మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు.
‘గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ తాగి చాలామంది చనిపోయారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారు. గతంలో మధ్య నిషేధంపై మీ నాయకుడితో మాట్లాడారా?. మద్యంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి చేశారా?. దశల వారీగా మారుస్తామన్నారు? మార్చారా?. మద్యం షాపులు తాకట్టు పెట్టి అప్పులు కూడా తెచ్చారు. బెల్టు దుకాణాలపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేము.. ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.