Corona Virus: కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి నిత్యం అంతకంతకూ పెరుగుతోంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిన్‌పింగ్ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చైనాలోని హైడియన్ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి.
కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యి,…
చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని చాంగ్‌కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళ్తున్నది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్‌కింగ్ ఎర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు. కాగా..ల్యాండింగ్ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది.…
ఒకప్పుడు ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు…
కరోనాకు పుట్టినిల్లైన చైనా జీరో వైరస్ ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సార్స్‌కోవ్ డీ వైరస్ వూహాన్‌లో పుట్టలేదని, ఇటలీ నుంచి వచ్చిందని కొన్నాళ్లు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే ప్రపంచానికి విషయం తెలిసిపోవడంతో కామ్‌గా ఉండిపోయింది. చైనాలో వ్యాక్సినేషన్‌తో పాటు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మరో దేశంపై చైనా అభాండాలు వేసింది. బీజింగ్‌లో ఇటీవలే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో చైనా అప్రమత్తం అయింది. బీజింగ్‌కు వచ్చిన…
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, జీరో కరోనా దేశంగా ఆవిర్భవించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. కరోనా కేసులు బయటపడుతున్న చోట కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటికే మూడు నగరాలలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే నాటికి ఎలాగైనా వైరస్‌ను కట్టడి…
కరోనా పుట్టినిల్లు అయిన చైనాకు సమస్యలు తప్పడం లేదు. ఒక సమస్యపోతే మరో సమస్య చైనాను వెంటాడుతోంది. తాజాగా అక్కడ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీనికోసం చైనా ఆంక్షలు విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలు ష్యంతో బీజింగ్‌లోని రహదారులు, పాఠశాలు, ఆటస్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ఇటీవల విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు వినియోగాన్ని పెంచడమే కారణంగా కనిపిస్తుంది. ఇటీవల బొగ్గు కొరతతో ఆదేశంలో విద్యుత్…
కరోనా మహమ్మారి విషయంలో వీలు దొరికినప్పుడల్లా చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ చైనాపై చాలా విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్ అని, బయోవెపన్ అని విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిశోధకులను వూహాన్‌లోకి అడుగుపెట్టనివ్వడం లేదని, వూహాన్ ల్యాబోరేటరీలో వైరస్‌ను తయారు చేసి అక్కడి నుంచి లీక్ చేశారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో చైనా మండిపడింది. ఎన్నికల సమయంలో కాస్త…