ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ 'స్కామ్'లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు.