తెలుగు చిత్రాలు -యన్టీఆర్ ‘జయసింహ’, ఏయన్నార్ ‘రోజులు మారాయి’తోనే వెలుగు చూసిన వహిదా రెహమాన్, హిందీ చిత్రసీమలో అందాలతారగా రాజ్యమేలారు. 1956లో గురుదత్ తన ‘సి.ఐ.డి.’ సినిమాతో వహిదాను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో బొంబాయితారగానే మిగిలిపోయారు వహిదా రెహమాన్. మొదట్లో గురుదత్, దేవానంద్ చిత్రాలలోనే మురిపించిన వహిదా రెహమాన్ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలా ఆమెకు తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘బీస్ సాల్ బాద్’. బిశ్వజిత్…