BCCI announces India Womens ODI, T20I Squads for 2023 Bangladesh Tour: బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న వైట్ బాల్ టూర్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. బంగ్లా పర్యటనకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత…
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే…
Jasprit Bumrah, KL Rahul likely to play Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ…
Shikhar Dhawan To Lead Team India in Asian Games 2023: చైనాలోని హాంగ్‌జై నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా భాగం చేశారు. దాంతో ప్రపంచ దేశాల్లోని అన్ని జట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహిళల సీనియర్ క్రికెట్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొననుండగా.. ద్వితీయ…
వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ప్రకటనపై పలువురు మాజీ క్రికెటర్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ నియామకంపై కొందరు భగ్గుమంటున్నారు. వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే పేరును బీసీసీఐ ఖరారు చేసింది.
అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఉత్కంఠంగానే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో క్లీయర్ గా అర్థం అవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో ఆసక్తిని కలిగించే ఐదు మ్యాచ్‌లు జరిగేటట్లు ప్లాన్ చేసుకున్నాడు. అందుకే జై షాను నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్ లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన…
Sunil Gavaskar Criticises BCCI Selectors For Dropping Cheteshwar Pujara from IND vs WI Test Series: వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో విఫలమయ్యాడనే కారణంతో అతడిని పక్కన పెట్టారు.…
Team India Set For Asian Games Debut: ఏషియన్ గేమ్స్ 2023కు చైనా అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చారు. క్రికెట్‌కు ఏషియన్ గేమ్స్‌లో గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్‌ను భాగం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగం కాగా.. ఈసారి భారత్ పాల్గొనబోతోంది.…