భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన జాబితా త్వరలో విడుదల కావాల్సి ఉంది. గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈసారి పక్కాగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్‌తో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా కాంట్రాక్టు…