ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి (నవంబర్ 22) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (నవంబర్ 24) నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందందని పేర్కొంది. Also Read: Ambati Rambabu:…
Rain Alert In AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు.
AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొనింది. మధ్యాహ్నానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.
Telangana Weather Update: తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1 నాటికి అల్పపీడనంగా మారే…
AP Weather Alert: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం, పాలకాయత్తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం వద్దకు వెళ్లిన పర్యాటకులను స్థానిక పోలీసులు వెనక్కి పంపుతున్నారు..
Andhra Pradesh Heavy Rains Alert: మధ్య బంగాళాఖాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. రేపటికి అల్ప పీడనంగా బలపడే అవకాశం ఉంది. ఆరు రోజులపాటు ఏపీకి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లా రేపు భారీ నుంచి అతి భారీ…
వాయుగుండం మరికొద్ది గంటల పాటు ఉత్తర భారతదేశంపై కొనసాగుతూ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఈ IMD Warning AP: వాయుగుండం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
Andhra Pradesh weather: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. 7.5కి.మీ వరకు అల్పపీడనం వ్యాపించింది. ఛత్తీస్‌ఘడ్ మీదుగా ద్రోణి, మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వచ్చే రెండు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గరిష్టంగా 60కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.…