నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ)లో చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కత్తుల బన్నీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మెలోకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 6 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారని ఆయన తెలిపారు. యూనివర్సిటీని పోలీసులు క్యాంపుగా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ లేదు, ల్యాప్‌టాప్‌లు లేవని, మెస్ సైతం సరిగ్గా లేదన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు.