కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.