Nepal: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు బ్రాండ్ల మసాలా దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ నివేదిక వచ్చే వరకు నిషేధం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ భారతీయ మసాలా వినియోగాన్ని సింగపూర్, హాంకాంగ్ నిషేధించాయి. ఈ మసాలా దినుసుల్లో పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉంటుందన్న భయంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుగంధ ద్రవ్యాలలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిశోధన ప్రారంభించబడింది.
READ MORE: Raghu Rama Krishna Raju: 125 నుంచి 150 సీట్లలో కూటమి విజయం..!
Also Read
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
MDH, ఎవరెస్ట్ పేర్లు దశాబ్దాలుగా చాలా ఫేమస్. ఈ బ్రాండ్‌ల మసాలా దినుసులు మిడిల్ ఈస్ట్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గతంలో గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్‌ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది. ప్రస్తుతం తక్కువ మొత్తంలో ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అయితే దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏజెన్సీ చెబుతోంది. ఇథిలీన్ ఆక్సైడ్ రంగులేని వాయువు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఇది తీపి వాసనను ఇస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం.. ఈ వాయువు ఇథిలీన్ గ్లైకాల్ (యాంటీ-ఫ్రీజ్) వంటి రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా, దీనిని వస్త్రాలు, డిటర్జెంట్లు, నురుగులు, మందులు, అంటుకునే పదార్థాలు మరియు ద్రావకాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసుల పరిశోధనలు బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జెన్నీ బిషప్ మాట్లాడుతూ.. ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రసాయనమని, ఇది మానవులకు క్యాన్సర్ వచ్చేలా చేస్తుందన్నారు. ఈ మసాలాలు తమ దేశంలో కూడా అందుబాటులో ఉన్నాయని ఈ అంశంపై విచారణ మొదలు పెడతామన్నారు.
తాజావార్తలు
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!