Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. దేశంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)కి చెందిన తారిఖ్ రెహమాన్ కూడా 17 ఏళ్ల తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. తారిఖ్‌ను బంగ్లా భవిష్యత్ ప్రధానమంత్రిగా చెబుతున్నారు. జమాత్-ఎ-తోయిబా (జెఎమ్), బిఎన్‌పి గురించి దేశంలో విశేషంగా చర్చ జరుగుతుంది. అయితే మరొక పార్టీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ పార్టీ రాబోయే ఎన్నికల్లో…
Muhammad Yunus: రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, పచ్చి భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసకు కారణమైంది. శనివారం హాది అంత్యక్రియలకు లక్షలాది జనం ఢాకాకు తరలివచ్చారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే, హాది అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. సంతాప సభలో ప్రసంగిస్తూ, హాదికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ భారత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు.
Bangladesh : బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింస మధ్య పరిస్థితిని నియంత్రించడానికి, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.