Bangladesh: బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.