Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని ఈ రోజు రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు
దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే సమయంలో కొందరు ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
Sheikh Hasina: అనూహ్య పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఇండియాకు చేరారు.
తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘మా దౌత్య కార్యకలాపాల ద్వారా మేము బంగ్లాదేశ్లోని భారతీయ సమాజంతో టచ్లో ఉన్నామని చెప్పారు. అక్కడ 19,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేసి.. ఆపై ఇంటిని తగుల బెట్టారు. మష్రాఫే షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అతని ఇంటిపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.