‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు బండ్ల గణేష్ తన మద్దతు యూటర్న్ తీసుకోవడంతో హాట్ టాఫిక్‌గా మారింది. జీవితా రాజశేఖర్ ఎంట్రీతో బండ్ల గణేష్ ఎగ్జిట్ అయ్యారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని బండ్ల గణేష్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ప్రస్తుతం రాజకీయాల గూర్చి మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ…
‘మా’ ఎన్నికల్లో ఈసారి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ అయితేనే మంచి చేస్తాడని నమ్ముతున్నానంటూ చెప్పిన బండ్ల గణేష్.. అనూహ్యంగా ప్రకాష్ ప్యానల్‌లోకి వచ్చిన జీవితా రాజశేఖర్ ను వ్యతిరేకిస్తూ బండ్ల బయటకు వచ్చారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘జీవితా అంటే నాకు వ్యక్తిగతంగా కోపం ఏమిలేదు.. ఆమె అంటే చాలా గౌరవం..…
“మా” ఎన్నికల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల్లో తన ప్యానెల్ కు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. దాంట్లో అందరికీ షాకిస్తూ హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా కన్పించాయి. గతంలో మహిళలకు అవకాశం అంటూ ఈ ఇద్దరూ “మా” అధ్యక్ష పదవికి పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వారిద్దరూ ప్రకాష్ రాజ్…
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ చిత్రం ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు విచారణకు హాజరయ్యారు. 8 గంటలకు పైగా పూరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. పూరి-బండ్ల గణేష్ గతంలో కొన్ని సినిమాలకు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ బాండింగ్ తోనే…
నిర్మాత, హాస్యనటుడు బండ్ల గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘బాద్ షా’, ‘టెంపర్’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ పారితోషికం విషయంలో బండ్ల మాట మార్చడం వల్లనే తేడా వచ్చినట్టుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈవిషమయై క్లారిటీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ భక్తులకు అదో పెద్ద పండుగ. ఆ రోజును మెగా అభిమానులు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ అభిమాన నటుడు పుట్టిన రోజు సందర్భంగా సామాజిక కార్యకలాపాలతో పాటు సేవ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ అభిమానులు ఖుషి చేసే మరో వార్తను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. పవర్ స్టార్ సంచలన బ్లాక్ బస్టర్ మూవీ “గబ్బర్…
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ…