వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో నేడు ఈడీ విచారణకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరుకానున్నారు.
జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు.
మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణమన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్ బండిసంజయ్. ఉక్కు మనిషి దివంగత సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు అనే బండి సంజయ్ వ్యాక్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని, సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్…
Why is Kavitha afraid of accusations? Sudhanshu Trivedi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తెలిపారు. మేము ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకపోతే బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణలో బీజేపీ నేతల అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా సంజయ్‌కి నిరసన తెలిపే హక్కు లేదా?…
హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో…