Why is Kavitha afraid of accusations? Sudhanshu Trivedi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తెలిపారు. మేము ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకపోతే బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణలో బీజేపీ నేతల అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా సంజయ్‌కి నిరసన తెలిపే హక్కు లేదా? అంటూ ప్రశ్నించారు.
ఇవాళ ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా..స్టేషన్ ఘన్ పూర్ లో బసచేసిన చోటే దీక్షకు రెడీ అయిన బండి సంజయ్ ను దీక్ష భగ్నం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఆ వీడియో విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలో ఉదయం చంద్రయాణాగుట్ట పోలీస్ ముందు ఎంఐఎం చంద్రయాణాగుట్ట కార్పొరేటర్లు స్టేషన్లో ఫిర్యాదులు చేసి, స్టేషన్ ఎదుటే నిరసనలు చేశారు. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటుయని హెచ్చరించారు. దీంతో రాజాసింగ్ ను అదుపులో తీసుకున్నారు.
Vellampalli Srinivas: చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ జీరో.. కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు