సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామంలో జైలు నుండి విడుదలైన కమలాపూర్ కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్ ఈ వాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ వేడెక్కుతోంది. పార్టీ నుంచి వ్యక్తిగతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన బంధు ఏమైంది? అని ప్రశ్నించారు.