హిందూ పుణ్య క్షేత్రాల్లో భక్తులు రాకుండా కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ నేత బండి సంజయ్య. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. శబరిమలలో అనేక మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని, చలికి ఇబ్బుందులు పడుతూ ఆయ్యప్పలు నరకరంఅనుభవిస్తున్నారని మండిపడ్డారు. చేతకాని కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్పలని ఇబ్బందిపెట్టడం ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఇబ్బందికర వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేయడమే వారి ఉద్దేశమన్నారు. తిరుపతి లోనూ పులులు వస్తే కర్రలు ఇచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తిరుపతికి హిందువులు వెళ్లకుండా జరుగుతున్న పరిణామాలు ఇవి అని పేర్కొన్నారు. ఇది హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్ర అని, శబరిమల లోనూ ఇదే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తబ్లీగి జమాత్ కి నిధులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కేరళ ప్రభుత్వంతో మాట్లాడలేకపోతుందా? అని ప్రశ్నించారు.