Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు.