Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని వైట్ హౌస్ ముందు బలూచిస్థాన్ వలసదారులు ఆందోళనకు దిగారు. గత 75 ఏళ్లలో బలూచిస్థాన్‌లో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని బలూచిస్థాన్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వహీద్ బలోచ్ నిరసన వ్యక్తం చేశారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Pak Army Chief: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 65 మంది చనిపోయారు. శుక్రవారం జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ కలవరపడుతోంది. అయితే ఈ దాడిపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్పందించారు. పాక్ నుంచి ఉగ్రవాద ముప్పును నిర్మూలిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మస్తుంగ్ లోని మదీనా మసీదు సమీపంలో మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది.
At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్…
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ ప్రావిన్సులోని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈద్ ఉల్ అదా(బక్రీద్) పండగ సమయంలో వీరంతా పక్కా ప్లాన్ తో జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటన బలూచిస్తాన్ లోని చమన్ జైలులో జరిగింది.