Balochistan: పాకిస్తాన్‌ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వణికిస్తోంది. కొత్తగా ‘‘ఆపరేషన్ బామ్’’ చేపట్టింది. దీంతో పాక్ సైన్యం, భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించేందుకు బీఎల్ఎఫ్ పోరాడుతోంది. బుధవారం బలూచిస్తాన్‌లోని టర్బాట్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో భాగమైన టర్బాట్‌లోని అబ్సర్ ప్రాంతంలోని ముహమ్మద్ యూనిస్ నివాసంపై మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు.
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ…