డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి.…