Balapur Hundi Income 2025: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంతో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లడ్డూకు రికార్డు ధర పలుకుతోంది. గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అందరి అంచనాలను అందుకుంటూ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ రికార్డు ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డే కాదు.. హుండీ…
ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్‌లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు…
హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ... ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది.
గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. గణపయ్యలకు బైబై చెబుతూ.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుండగా.. ఈ రోజు కీలక నిమజ్జనం జరగనుంది..
Hyderabad Traffic: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు.
Balapur Laddu Action: హైదరాబాదులో గణేష్ ఉత్సవాలు శోభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గణేష్ నవరాత్రులు చివరి దశకు చేరుకునేసరికి హైదరాబాద్ నగర వాసులు, అలాగే ప్రపంచంలో ఉన్న గణేష్ భక్తుల దృష్టి అంత ప్రత్యేకించి ఒక గణేష్ మండపం పైన పడుతుంది. అదే బాలాపూర్ గణేష్ మండపం. బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గణేష్ నవరాత్రుల్లో చివరి రోజు అయిన 11వ రోజున నిమజ్జయానికి…
Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటారు.
ఉదయం ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభయాత్ర.. హుస్సేన్ సాగర్ కు చేరుకుని భారీ భక్తజన సందోహం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. బాలాపూర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర కొనసాగింది.
Khairatabad-Balapur Ganesh Live Updates: గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.