Balapur Laddu Action: హైదరాబాదులో గణేష్ ఉత్సవాలు శోభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గణేష్ నవరాత్రులు చివరి దశకు చేరుకునేసరికి హైదరాబాద్ నగర వాసులు, అలాగే ప్రపంచంలో ఉన్న గణేష్ భక్తుల దృష్టి అంత ప్రత్యేకించి ఒక గణేష్ మండపం పైన పడుతుంది. అదే బాలాపూర్ గణేష్ మండపం. బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గణేష్ నవరాత్రుల్లో చివరి రోజు అయిన 11వ రోజున నిమజ్జయానికి ముందు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలాన్ని వేస్తారు. 2023లో రికార్డు సృష్టిస్తూ ఏకంగా 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. అయితే ఆయన లడ్డు పొందిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిపారు. మరి అవి ఏంటో చూద్దామా..
East Godavari: వృద్ధ దంపతుల ప్రాణం తీసిన కోతి
2023లో 27 లక్షలు భారీ ధరకు లడ్డును దక్కించుకున్న తర్వాత ఆయనకు సంతోషంగా, ఆత్మసంతృప్తి, మనశ్శాంతి, కోరుకున్నవి పొందామని తెలియజేశారు. ముఖ్యంగా తన తండ్రి అనారోగ్యం కారణంగా ఏమవుతాడో అనుకున్న ఆయన కేవలం ఒక్క రోజులోనే రికవరీ అయ్యాడని అది కేవలం వినాయకుడి ఆశీర్వాదమని.. ఇదివరకు హాట్ స్ట్రోక్ ఉన్న నాన్నకు ఈ సంవత్సరంలో అనుకోకుండా ఒకసారి గుండె నొప్పి వచ్చిన సమయంలో తాను ఇంట్లోనే ఉండడంతో పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నారని.. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి ఒక్క రోజులోనే రికవరీ అయ్యారని తెలిపారు. అలాగే తన పిల్లలు చదువులో కూడా పురోగతి సాధించారని తెలిపారు.
DJ Sound Effect : అలర్ట్.. డీజే శబ్ధం కారణంగా మెదడులో రక్తస్రావం.. పరిస్థితి విషమం!
ఈ ఏడాది కూడా లడ్డు 30 లక్షల రూపాయలు పలుకుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి కూడా వస్తాను.. వేలంపాటలో కచ్చితంగా పాల్గొంటున్నానని.. మరొకసారి దక్కించుకొని రికార్డులు బ్రేక్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.