రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను రెండు సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. దీంతో అధికారులు ఆ థియేటర్లను సీజ్ చేశారు. చట్ట సవరణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి థియేటర్స్ పై మొదటిసారి సర్కార్ యాక్షన్ తీసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర మిని ధియేటర్ అఖండ సినిమా ఉదయం…
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు.…
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాసులు లేకపోవడంతో పోలీసులు శిల్పాకళావేదికలోకి వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి నందమూరి అభిమానులకు సారీ…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్కడికైనా వెళ్తే తలదించుకోం.. తలతెంచుకుని వెళ్లిపోతాం’ అంటూ విలన్‌ను హెచ్చరించే సీన్ అయితే అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ‘దేవుడిని కరుణించమని…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే…
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విడుదలకు సిద్దమవుతూన్న విషయం తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇప్పటికే ‘అఖండ’ ట్రైలర్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా…
నందమూరి అభిమానులకు పండగ మొదలయింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హైవోల్టేజ్ మూవీ అఖండ సినిమా ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండుగ రోజే.. “విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదల యింది. ఆ తర్వాత మొత్తం దుమ్మురేపే మాస్ సీన్‌లతో ట్రైలర్ సాగుతుంది. ” అంచనా వేయడానికి…
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ..’ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాలు రాగా.. హ్యట్రిక్ చిత్రంగా వస్తున్న ‘అఖండ’పై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆసక్తిగా…
బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’. బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు ‘సింహా’, ‘లెజెండ్’ ఒకదానిని మించి మరోటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘అఖండ’పై ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తగినట్లే బోయపాటి ఎంతో పట్టుదలతో ‘అఖండ’ను ఎలాగైన హిట్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. తాజా సమాచారం ప్రకటారం ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉంటాయట. అందులో ప్రత్యకంగా ఇంటర్వెల్…