రిఫరీ చేసిన తప్పిదం వల్ల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌సిప్ టోర్నీలో ఓటమి పాలైన పివి సింధుకి తాజాగా కమిటీ క్షమాపణలు చెప్పింది. ఆ మానవ తప్పిదానికి సారీ చెప్తున్నామని, ఇలాంటి పొరబాట్లు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ తెలిపారు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు (పీవీ సింధు) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాం. ఇప్పుడు ఆ పొరబాటుని సరిదిద్దే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు…