యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని…