హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆమె కజిన్ సిస్టర్ బబిత ఫోగట్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వినేష్.. కాంగ్రెస్‌లో చేరడాన్ని బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.