Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్‌ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది.
ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిక్ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్‌ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్‌పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.