Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు,