Pawan Kalyan: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్ కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ పాల్గొన్నారు. ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు తెలిపారు.
Read Also: Merugu Nagarjuna: పురంధేశ్వరి టీడీపీ బీ-టీం.. ఆమె మాటలకు విలువ లేదు..
ఇదిలా ఉండగా.. 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. రజనీకాంత్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రతన్‌టాటాలకు కూడా ఆహ్వానం అందింది. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.