Ram Mandir : శ్రీ రామజన్మభూమిలో రాములోరి ప్రతిష్ఠాపన కోసం ఐదు వందల ఏళ్ల నిరీక్షణ ఫలించింది. గురువారం నూతన ఆలయ గర్భగుడిలోని కూర్మ శిలాపై కొలువుదీరడంతో తెరపడింది. శ్యామ్ శిలాతో చేసిన రాంలాలా విగ్రహం అదే రాతితో చేసిన కమలంపై ఉంచబడింది.
Ayodhya Ram Mandir To Deal With The Cyber Threats: జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అందుకు ముందుగానే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు గత కొన్ని రోజులుగా రామమందిరం పేరుతో ప్రజలకు అనేక రకాల ఫేక్ మెసేజ్ లు పంపి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం…
Ram Mandir : టాంజానియన్ కంటెంట్ సృష్టికర్త కిలి పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను రూపొందించడంలో చాలా పాపులర్. తను తరచుగా భారతీయ పాటలకు పెదవి సింక్ చేయడం, కొన్నిసార్లు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేయడం అందరికీ తెలిసిందే.
Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడి (5 ఏళ్ల రాముడి…
Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు.
Ram Mandir Features: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహం ఆలయ గర్భగుడికి చేరుకుంది. ఈ రోజు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రతిష్ట తర్వాత బాల రాముడు వివిధ పూజలు చేయనున్నారు.
Ram Mandir: అయోధ్య ‘ప్రాణప్రతిష్ట’ కార్యక్రమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రామ్ లల్లా విగ్రహాన్ని రామ మందిరానికి తీసుకువచ్చారు. క్రేన్ సాయంతో గర్భగుడి వద్దకు చేర్చారు. ఈ రోజు గర్భగుడిలో రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతుండగా.. రాముడి విగ్రహం ఆలయానికి చేరుకుంది.
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ayodhya Ram Mandir Ceremony SCAMs: భారతదేశంలో, ఏ విషయం ఎక్కువగా చర్చించబడుతుందో, దాని పేరుతో మోసాలు చేయడం మొదలు పెడతారు కేటుగాళ్లు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. రామ మందిరం కోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు కానీ సామాన్యులను ఆరోజు మాత్రం అనుమతించడం లేదు. జనవరి 22న, ఆహ్వానం అందుకున్న…