అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు ఈ విమానయాన సంస్థను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? అసలు దీని చరిత్ర…
ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ స్పందించాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్‌లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే…
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.