ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ స్పందించాడు. ఇకపై తాను ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కనని తెలిపాడు. ఈ సందర్భంగా వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. జీవితంలో ఎయిర్ ఇండియా విమానాల జోలికి వెళ్లనని అన్నాడు. నిజానికి ఎయిర్ ఇండియాలో పనిచేసిన వివేక్ , ఆ సంస్థపై సంచలన ఆరోపణలు చేశాడు.
READ MORE: Australian Big Bash League: సొంత దేశం ఛీ కొట్టింది.. ఆస్ట్రేలియాతో ఒప్పందం
బోయింగ్ విమనాల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాడు. ఈ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఓ వీడియో కింద కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చదివిన వార్నర్ ఆ వ్యక్తి కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి.. ఒకవేళ ఆ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు నిజమైతే నేను సచ్చినా ఎయిర్ ఇండియా విమానం ఎక్కనని చెప్పాడు. వార్నర్ స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తద్వారా భవిష్యతులో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గే అవకాశముంది. గతంలోనూ ఎయిర్ ఇండియా విమానంపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా సేవల నాణ్యతపై నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. పైలట్లు లేని విమానంలో ప్రయాణీకులను ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించకపోవడం ఇలా చాలానే జరిగాయి.
READ MORE: 11A Mystery: రెండు భారీ విమాన ప్రమాదాలు.. ఆ సీటులో కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం ఎలా బతికారు..?