ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.