“అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన మాగ్నమ్ ఓపస్‌కి సీక్వెల్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. సరికొత్త సాంకేతికతతో వరుస పెట్టి సీక్వెల్స్ ను రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు…