వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంపెనీ నుంచి ఇటీవలే ఎలక్ట్రిక్ ట్రియో ఆటోలు విడుదలయ్యాయి. ఈ ట్రియో ఆటోపై జోహో సీఈవో శ్రీథర్ ట్వీట్ చేశారు. మహీంద్రా ట్రియో ఆటో బాగుందని, ఒకసారి రీఛార్జ్ చేస్తే 125 కిమీ వరకు వెళ్లవచ్చని ట్వీట్ చేశారు. పల్లెటూరి రోడ్లకు అనుగుణంగా డిజైన్ ఉందని, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేందుకు, డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు, ఆకట్టుకునే విధమైన రంగుల్లో ఆటోను డిజైన్ చేయాలని జోహో సీఈవో సూచించారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అన్నివిధాలుగా అందర్ని మహీంద్రా ట్రియో ఆటో ఆకట్టుకుంటోందని తెలిపారు. జోహో సీఈవో ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించాల్సి ఉంది. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
Read: మీ దళితబంధు ఎటు పోయింది : కిషన్‌రెడ్డి
మహీంద్రా కంపెనీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5 వేల ఎలక్ట్రిక్ ఆటోలు ఆమ్ముడయ్యాయి. చిన్న చిన్న మార్పులు చేస్తే తప్పని సరిగా ట్రియో సక్సెస్ అవుతుందని జోహో సీఈవో పేర్కొన్నారు. ఈ చిన్న ఈవీ ఆటో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. రూ.3.5 లక్షల లోపే ధర ఉండటంతో ఎక్కువ మైలేజ్ వస్తుండటంతో తప్పనిసరిగా సక్సెస్ అయ్యేందుకు ఛాన్స్ ఉందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
1/ Yesterday I got my new@MahindraElctrc Treo electric auto. This one is a serious upgrade – capable of 55 km/hour speed and a range of 125 km on a full charge. That makes it a practical commute vehicle and I love driving it around!
— Sridhar Vembu (@svembu) December 6, 2021
I have some suggestions @anandmahindra pic.twitter.com/XyWBLJyv8l