ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు.…