నెదర్లాండ్స్ 9 పరుగులకే ఆఖరి 5 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 310 పరుగుల భారీ తేడాతో కొత్త ప్రపంచకప్ రికార్డును నెలకొల్పింది.
2023 ప్రపంచకప్‌లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.