కార్పొరేట్ మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కాని అదేంటో ఈమధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు, దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నాయి. మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోలు తెగ నచ్చేస్తున్నారు. ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ కు చెందిన టి సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకుని వదలడంలేదు. ప్రభాస్ తో రెండు సినిమాలను కమిటైంది. అందుల్లో ఒకటి ఆదిపురుష్ భారీ బడ్జెట్ పై…