కార్పొరేట్ మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కాని అదేంటో ఈమధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు, దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నాయి. మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోలు తెగ నచ్చేస్తున్నారు.
ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ కు చెందిన టి సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకుని వదలడంలేదు. ప్రభాస్ తో రెండు సినిమాలను కమిటైంది. అందుల్లో ఒకటి ఆదిపురుష్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా ఫ్లాపైంది. ప్రభాస్ తో టీ సిరీస్ చేయబోయే రెండవ సినిమా స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ వచ్చినా సరే టిసిరీస్ ప్రభాస్ ను వదలడం లేదు.
Also Read : Allu : శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్…
ఇక సరిగమ ఆల్రెడీ కిరణ్ అబ్బవరంతో దిల్ రుబా అనే సినిమా చేసింది. ఇప్పుడు నానిలోని స్టఫ్ ను చూసి ది ప్యారడైజ్ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానంటుంది. హిట్ 3తో మాస్ ర్యాంపేజ్ ఆడేస్తున్న నాని ది ప్యారడైజ్ తో అంతకుమించిన సినిమా చూపిస్తామని చెబుతున్నాడు. బహుశ గోయంకా గ్రూప్ కు చెందిన సరిగమకు ఇదే నచ్చింది కాబోలు. అందుకనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్యారడైజ్ కు ఫండింగ్ చేస్తానని సరిగమ ఎండి విక్రమ్ మెహ్రా ముందుకొచ్చాడు. నిజానికి ఈ మ్యూజిక్ కంపెనీలన్నీ కేవలం ఆడియో రైట్స్ తోనే సరిపెట్టుకోలేవు. అంతకుమించిన ఇమీడియట్ క్యాష్ వారికి కావాలి. అది సినిమాలను పంపిణీ చేయడం, ప్రొడ్యూస్ చేయడంతో వస్తుంది. అందుకనే టిసిరీస్ ను చూసి సరిగమవారు కూడా ఫీల్డ్ లోకి వచ్చి తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సోనీగ్రూప్ ఫీల్డ్ కు వచ్చి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ తమ బ్రాండ్ ఇదీ అని చూపించుకున్నారు. అదే సాహసం సరిగమ కూడా చేయబోతుందనే టాక్ తెలివుడ్ లో వినిపిస్తోంది.