Story Board: మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీకున్న హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధారపోస్తా అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో…రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంభాలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు. నాలుగో స్థంభమైనది మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా…