డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ చాలామంది ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఆర్బీఐ ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్‌వర్క్ కలిగిన చిన్న బ్యాంకులపై…