హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని దుండిగల్‌లో ఏటీఏం కేంద్రాలకు డబ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారయ్యాడు. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే యువకుడు డ్రైవర్‌గా చేరాడు. శనివారం మధ్యాహ్నం రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్‌లతో కలిసి సాగర్ రైటర్స్ సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13…