Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు…
ప్రసంగించడం ఓ కళ అయితే దానికి కేరాఫ్ అడ్రస్ ఆయన. సభ ఏదైనా చమత్కారం జోడించి శ్రోతలు చూపు తిప్పుకోలేనంత అందంగా మాట్లాడే వ్యక్తి. పోఖ్రాన్ అణుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్ గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు. ఆయనే బీజేపీ నేత, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్. ఈరోజు ఆయన 98వ జయంతి.
భారతదేశం భూమిలో ఒక ముక్క కాదు, ఇది సజీవ దేశం అని చెప్పిన అటల్ బీహారి వాజపేయి బయోపిక్ కోసం బాలీవుడ్‌లో రంగం సిద్ధమయ్యింది. భనుశాలి ప్రొడక్షన్స్ పై వినోద్ ఈ మూవీని జూన్ నెలలో అనౌన్స్ చేశారు. అప్పటినుంచి అటల్ బిహారీ వాజపేయిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం బీ-టౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి లైం లైట్ లోకి వచ్చాడు. వాజపేయిగా…
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్థంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తోంది.. ఆయన సేవలను స్మరిస్తోంది.. 1924 డిసెంబర్ 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయ్.. 2018 ఆగస్టు 16న కన్నుమూశారు.. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నేత ఆయన.. మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం…
దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం ద్వారా ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పై 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపొందిన సందర్భంగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.
అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు.…