భారతదేశం భూమిలో ఒక ముక్క కాదు, ఇది సజీవ దేశం అని చెప్పిన అటల్ బీహారి వాజపేయి బయోపిక్ కోసం బాలీవుడ్‌లో రంగం సిద్ధమయ్యింది. భనుశాలి ప్రొడక్షన్స్ పై వినోద్ ఈ మూవీని జూన్ నెలలో అనౌన్స్ చేశారు. అప్పటినుంచి అటల్ బిహారీ వాజపేయిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం బీ-టౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి లైం లైట్ లోకి వచ్చాడు. వాజపేయిగా నటించడం తన అదృష్టంగా చెప్పిన పంకజ్, ఈ బయోపిక్ లో నటిస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ బయోపిక్ కి మే రహూ యా నా రహూన్ ఏ దేశ్ రెహనా చాహియే అటల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు (Main Rahoon Ya Na Rahoon Yeh Desh Rehna Chahiye Atal). ఉల్కేష్ ఎన్.పి రాసిన ది అన్ టోల్డ్ వాజపేయి అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. రవి జాదవ్ డైరెక్ట్ చేస్తున్న మే రహూ యా నా రహూన్ ఏ దేశ్ రెహనా చాహియే అటల్ సినిమా 2023 క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
Read Also: Nithya Menon: పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన పవన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్
తన రాజకీయ జీవితంలో మూడు సార్లు ప్రధాన మంత్రిగా పని చేసిన అటల్ బిహారీ వాజపేయి, మొదటిసారి 13 రోజులు(1996) మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రెండో సారి 13 నెలలు(1998-1999) పదవిలో ఉన్నారు. పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్టులు చేసింది, ఈ సమయంలోనే. మూడోసారి 1999 నుంచి 2004 వరకూ ప్రధాన మంత్రిగా ఫుల్ టర్మ్ పదవిలో ఉన్నారు. తన పాలనలో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించి, సైన్యానికి దూకుడుని నేర్పించిన అటల్ బిహారీ వాజపేయి 93 ఏళ్ల వయసులో 2018 ఆగస్ట్ 16న మరణించారు. అటల్ బిహారీ వాజపేయి జీవిత విశేషాలని చూపించాలి అంటే కార్గిల్ యుద్ధ సమయంలో ప్రధాన మంత్రి ఎలా వ్యవహరించాడో చెప్పొచ్చు, దేశంలో న్యూక్లియర్ టెస్టులు ఎలా చేశారో చెప్పొచ్చు, 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్ ని గవర్నమెంట్ ఎలా ఎదురుకుందో చెప్పొచ్చు… ఇలా అటల్ బిహారీ వాజపేయి గురించి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మోడరన్ ఇండియన్ హిస్టరీలోనే కీలక గట్టాలని చెప్పాలి.