సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం.