ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నామని తెలిపారు. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చిస్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని అన్నారు. మరోవైపు టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని కేంద్ర సర్కార్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరాడు.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీలో నేను వస్తానోరానో తెలియదు అని వ్యాఖ్యనించాడు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అనుకుంటున్నా.. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రాజాసింగ్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ( ఆదివారం ) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు కేసీఆర్ సర్కార్ కు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చివరి రోజైన ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది.
రాజస్థాన్ అసెంబ్లీలో రెడ్ డైరీ కలకలం లేపింది. రెడ్ డైరీలో అంశాలపై చర్చించాలని పట్టుపట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజేంద్ర గుడాను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.